సీఎం కేసీఆర్‌ వైఖరితో రైతాంగానికి కష్టాలు, కన్నీళ్లు

ABN , First Publish Date - 2022-05-25T05:25:56+05:30 IST

పూటకోమాట మాట్లాడుతూ ఇచ్చిన హామీలు గాలికొదిలేసిన సీఎం కేసీఆర్‌ వైఖరితో రైతాంగానికి కష్టాలు, కన్నీళ్లు మిగిలాయని చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి అన్నారు.

సీఎం కేసీఆర్‌ వైఖరితో రైతాంగానికి కష్టాలు, కన్నీళ్లు
ఎల్లారెడ్డిపేట గ్రామంలో రైతు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్న చెరుకు శ్రీనివా్‌సరెడ్డి

మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి

చేర్యాల, మే 24: పూటకోమాట మాట్లాడుతూ ఇచ్చిన హామీలు గాలికొదిలేసిన సీఎం కేసీఆర్‌ వైఖరితో రైతాంగానికి కష్టాలు, కన్నీళ్లు మిగిలాయని చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి అన్నారు. చేర్యాల మండలం వీరన్నపేట గ్రామంలో మంగళవారం రైతురచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులను కలిసి ఇబ్బందులు అడిగి తెలుసుకుని వరంగల్‌ డిక్లరేషన్‌ కరపత్రాలను అందించి అవగాహన కల్పించారు. అనంతరం ఇటీవల తాటిచెట్టు పైనుంచి కిందపడి చనిపోయిన గీత కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. 

రైతుల జీవితాల్లో వెలుగులు నింపడానికే రైతు డిక్లరేషన్‌

తొగుట, మే 24: రైతుల జీవితాల్లో వెలుగులు నింపడానికే రైతు డిక్లరేషన్‌ పెట్టామని కాంగ్రెస్‌ దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. మండల పరిధిలోని పెద్దమాసాన్‌పల్లి, ఎల్లారెడ్డిపేట గ్రామాల్లో రైతు రచ్చబండలో పాల్గొని ఉపాధి కూలీలు, రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు అక్కం స్వామి పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ పాలనలోనే రైతులకు మేలు

కోహెడ, మే 24: కాంగ్రెస్‌ పరిపాలనలోనే రైతులకు మేలు జరిగిందని, రైతులకు న్యాయం చేసేందుకే ఈ రచ్చబండ కార్యక్రమం అని కాంగ్రెస్‌ హుస్నాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బొమ్మ శ్రీరాంచక్రవర్తి అన్నారు. మంగళవారం కోహెడ మండలంలోని వరికోలు గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వరంగల్‌ డిక్లరేషన్‌ కరపత్రాలను రైతులకు అందజేశారు. 

కాంగ్రె్‌సలో పలువురి చేరిక

మండలంలోని వరికోలు గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు కాంగ్రె్‌సలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో సంధి లక్ష్మారెడ్డి, సంపత్‌రెడ్డి, బాల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, మడుపు రాజిరెడ్డి, ముంజ స్వామి, ముత్యాల మాణిక్యరెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివా్‌సరెడ్డ్డి, బోయిని బాబు తదితరులు ఉన్నారు. 

Read more