‘ధరణి’ని రద్దు చేయాల్సిందే

ABN , First Publish Date - 2022-11-24T22:55:17+05:30 IST

భూ సమస్యలకు కేరాఫ్‌ అడ్ర్‌సగా మారిన ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు.

‘ధరణి’ని రద్దు చేయాల్సిందే
వట్‌పల్లిలో రాస్తారోకో చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌, నవంబరు 24: భూ సమస్యలకు కేరాఫ్‌ అడ్ర్‌సగా మారిన ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. టీపీసీసీ పిలుపు మేరకు గురువారం సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లోని మండల కేంద్రాల్లో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు చేశారు. ధరణి పోర్టల్‌తో రైతులకు భూ సమస్యలు ఏర్పడి కార్యాలయాల చుట్టూ సంవత్సరాల తరబడి తిరుగుతున్నా పరిష్కారం కావడం లేదన్నారు. ధరణిని రద్దు చేయాలని తహసీల్దార్లకు వినతిపత్రాలను అందజేశారు.

Updated Date - 2022-11-24T22:55:17+05:30 IST

Read more