తొలిరోజు బాలాత్రిపురసుందరీదేవిగా..

ABN , First Publish Date - 2022-09-27T05:27:58+05:30 IST

శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు విశేష పూజల అనంతరం మండపాల్లో కొలువుదీరిన అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. ఏడుపాయల వనదుర్గామాతకు మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం పల్లకీలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన మండపం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు.

తొలిరోజు బాలాత్రిపురసుందరీదేవిగా..
ఏడుపాయలలో పూజలు చేస్తున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఆలయ చైర్మన్‌, సభ్యులు

ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు  

భక్తిశ్రద్ధలతో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం 

ఏడుపాయలలో దుర్గామాతకు పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి


పాపన్నపేట, సెప్టెంబరు 26: శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు విశేష పూజల అనంతరం మండపాల్లో కొలువుదీరిన అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. ఏడుపాయల వనదుర్గామాతకు మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం పల్లకీలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన మండపం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. వేద బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఎమ్మెల్యేతో పాటు పాలకమండలి సభ్యులు, భక్తులు కుంకుమార్చనలో పాల్గొన్నారు. పూజల్లో ఆలయ కమిటీ చైర్మన్‌ బాలాగౌడ్‌, ఈవో శ్రీనివాస్‌, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, మనోహర్‌, వెంకటేశం, కె.శ్రీనివా్‌సరావు, మోహన్‌రావు, పెంటయ్య, సాయిలు, చక్రపాణి, యాదాగౌడ్‌, సిద్దిరాములు, మాణెమ్మ, నాగభూషణం, బాగారెడ్డి, శంకర్‌శర్మ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. 


సప్తప్రాకారయుత  దుర్గాభవానీ మహాక్షేత్రంలో.. 

సంగారెడ్డి రూరల్‌ : సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట గ్రామంలోని సప్తప్రాకారయుత దుర్గాభవానీ మహాక్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు  సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవిగా కొలువుదీరి భక్తులచే పూజలందుకున్నారు.  ఆలయ ధర్మాధికారి రాధాకృష్ణమూర్తి పర్యవేక్షణలో ఆలయ ప్రధానార్చకులు రవికుమార్‌ శర్మ, దత్తాత్రేయ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయంలో అమ్మవారికి 108 ప్రదక్షిణలు చేసి ముడుపులు కట్టి తమ కోరికలు తీర్చాలని వేడుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఉత్సవ నిర్వాహకులు సదుపాయాలు, నిత్యాన్నదానం ఏర్పాటు చేశారు.


రాయికోడ్‌ ముమ్మాదేవి ఆలయంలో..

రాయికోడ్‌, సెప్టెంబరు 26: మండల కేంద్రమైన రాయికోడ్‌లోని ముమ్మాదేవి ఆలయంలో సోమవారం శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే భక్తులు, అర్చకులు ఊరేగింపుగా వెళ్లి గంగ నీళ్లు తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం అర్చకుడు సందీ్‌పకుమార్‌జోషి ఆధ్వర్యంలో అమ్మవారిని బాల త్రిపురసుందరీ దేవిగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం హరికథా కాలక్షేపం, రాత్రి భజన కీర్తనలు నిర్వహించారు. 


కేతకీ ఆలయంలో ఘనంగా పూజలు

ఝరాసంగం, సెప్టెంబరు 26: మండల కేంద్రమైన ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు మంగళగౌరిగా దర్శనమిచ్చారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో ఈవో శశిధర్‌, సర్పంచ్‌ జగదీశ్వర్‌, మాజీ సర్పంచ్‌ రుద్రప్పపాటిల్‌, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పాల్గొన్నారు. 

Read more