అవుసులోనిపల్లిలో అభివృద్ధి పనులు భేష్‌

ABN , First Publish Date - 2022-06-07T05:56:57+05:30 IST

వర్గల్‌ మండలం అవుసులోనిపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులు బాగున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌ శరత్‌ మెచ్చుకున్నారు.

అవుసులోనిపల్లిలో అభివృద్ధి పనులు భేష్‌
మర్కుక్‌లో నర్సరీని పరిశీలిస్తున్న పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ శరత్‌

 పంచాయతీరాజ్‌ కమిషనర్‌ శరత్‌ కితాబు

వర్గల్‌/జగదేవ్‌పూర్‌, జూన్‌ 6: వర్గల్‌ మండలం అవుసులోనిపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులు బాగున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌ శరత్‌ మెచ్చుకున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం వర్గ ల్‌ మండలం అవుసులోనిపల్లి గ్రామాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్‌ యార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన మొక్కలు, వాటర్‌ ఫౌంటెన్‌ నిర్వహణ, నర్సరీని చూసి గ్రామ సర్పంచ్‌ కరుణాకర్‌తో పాటు సెక్రటరి నాగభూషణంను అభినందించారు. అవుసులోనిపల్లె గ్రామంలో పచ్చదనం, ప్రశాంత వాతావరణం బాగుందని, పారిశుధ్య నిర్వహణ, గ్రామాన్ని శుభ్రంగా తీర్చి దిద్దడంలో సిబ్బంది పనితీరు బాగుందని కమిషనర్‌ కితాబిచ్చారు. అదేవిధంగా మర్కుక్‌ పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీలను ఆయన పరిశీలించారు. అనంతరం సమీకృత కార్యాలయ భవన నిర్మాణం పనుల పరిశీలించి, భవన నిర్మాణ  పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో సురే్‌షబాబు, ఎస్‌బీఎం డైరెక్టర్‌ సురేష్‌ బాబు, గడ ప్రత్యేక అధికారి  ముత్యంరెడ్డి, పీఆర్‌ఈఈ శ్రీనివా్‌సరావు, డీఆర్డీవో గోపాల్‌, దేవకీదేవి,  కౌసల్యాదేవి, స్థానిక అధికారులు, నాయకులు తదితరులు ఉన్నారు. 

Read more