గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే రసమయి

ABN , First Publish Date - 2022-10-04T04:56:43+05:30 IST

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు.

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే రసమయి
గుండారంలో సెంట్రల్‌ లైటింగ్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌

బెజ్జంకి, అక్టోబరు 3: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. సోమవారం మండలంలోని గుండారం, బేగంపేట గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సెంట్రల్‌ లైటింగ్‌ను ప్రారంభించి, కల్యాణలక్ష్మి పంపిణీ చేసి మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఏర్పాటుచేసిన సెంట్రల్‌ లైటింగ్‌తో నూతన శోభ సంతరించుకున్నదని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు లావణ్య, సంజీవరెడ్డి, ఎంపీటీసీ లత,మండల కో ఆప్షన్‌ మెంబర్‌ మహిపాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, శ్రీనివా్‌సగుప్తా, శేఖర్‌బాబు, బోనగిరి శ్రీనివాస్‌, పాపయ్య, వార్డుసభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు. 

Read more