తూప్రాన్‌ పట్టణంలో డెంగీ కలకలం

ABN , First Publish Date - 2022-07-19T05:25:50+05:30 IST

డెంగీతో చికిత్సపొందుతూ డిగ్రీ విద్యార్థి మృతి చెందిన సంఘటన మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో కలకలం రేపింది. జిల్లాలోని శివ్వంపేట మండలం శభా్‌షపల్లికి చెందిన అయ్యగారి యాదగిరి, స్వరూప దంపతులు తూప్రాన్‌లో నివాసముంటున్నారు. వారి చిన్నకుమారుడు శరత్‌కుమార్‌(21) గజ్వేల్‌లోని డీఎంఆర్‌ కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు.

తూప్రాన్‌ పట్టణంలో డెంగీ కలకలం
నిల్వ నీటిలో మందును చల్లుతున్న వైద్య సిబ్బంది

చికిత్స పొందుతూ డిగ్రీ విద్యార్థి మృతి


శివ్వంపేట/తూప్రాన్‌, జూలై 18: డెంగీతో చికిత్సపొందుతూ డిగ్రీ విద్యార్థి మృతి చెందిన సంఘటన మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో కలకలం రేపింది. జిల్లాలోని శివ్వంపేట మండలం శభా్‌షపల్లికి చెందిన అయ్యగారి యాదగిరి, స్వరూప దంపతులు తూప్రాన్‌లో నివాసముంటున్నారు. వారి చిన్నకుమారుడు శరత్‌కుమార్‌(21) గజ్వేల్‌లోని డీఎంఆర్‌ కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న శరత్‌కుమార్‌ను మెరుగైన చికిత్స కోసం రెండురోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. డెంగీగా నిర్ధారణ కాగా చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. శరత్‌కుమార్‌ అంత్యక్రియలు సోమవారం స్వగ్రామమైన శభా్‌షపల్లిలో నిర్వహించారు. 


రక్త నమూనాల సేకరణ

పట్టణ పరిఽధిలో డెంగీ మరణం నమోదవడంతో తూప్రాన్‌ మున్సిపల్‌, వైద్యఆరోగ్య శాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు. జిల్లా మలేరియా సహాయ అధికారి సోమవారం హుటాహుటిన తూప్రాన్‌ పట్టణానికి చేరుకుని వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. తూప్రాన్‌ పట్టణంలోని 16వ వార్డులో మృతుడి కుటుంబం నివాసమున్న ఇంటి పరిసరాల్లో మురుగు కాలువలు, నీళ్లు నిల్వ ఉన్న ప్రదేశాల్లో దోమల నివారణ మందు స్ర్పే చేశారు. బ్లీచింగ్‌ పౌండర్‌ను చల్లారు. మృతుడి ఇంటికి చుటుపక్కల ఇళ్లల్లో నివాసముంటున్న జ్వరాలతో బాధపడుతున్న 50 మంది రక్తనమూనాలను సేకరించి డెంగీ పరీక్షల నిమిత్తం పంపించారు. మున్సిపల్‌ చైర్మన్‌ రాఘవేందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ సిబ్బంది, సీహెచ్‌వోలు సాలుబాయి, బాల్‌నర్సయ్య 16వ వార్డులో పర్యటించారు. 

Read more