రెండు వారాలకు మించి దగ్గు ఉంటే ‘క్షయ‘ వ్యాధి కావొచ్చు: ఏసీఎ్‌సఎం

ABN , First Publish Date - 2022-03-17T04:24:47+05:30 IST

రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం వంటివి క్షయ వ్యాధిగా అనుమానించవచ్చని అడ్వకసీ కమ్యూనికేషన్‌ సోషల్‌ మోబిలైజేషన్‌(ఏసీఎ్‌సఎం) కోఆర్డీనేటర్‌ అరుణ తెలిపారు.

రెండు వారాలకు మించి దగ్గు ఉంటే  ‘క్షయ‘ వ్యాధి కావొచ్చు: ఏసీఎ్‌సఎం

సంగారెడ్డి అర్బన్‌, మార్చి 16 : రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం వంటివి క్షయ వ్యాధిగా అనుమానించవచ్చని అడ్వకసీ కమ్యూనికేషన్‌ సోషల్‌ మోబిలైజేషన్‌(ఏసీఎ్‌సఎం) కోఆర్డీనేటర్‌ అరుణ తెలిపారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం క్షయ వ్యాఽధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అరుణ మాట్లాడుతూ రాత్రుల్లో చెమటలు, తెమడలో రక్తం పడటం వంటివి లక్షణాలుంటే వెంటనే దగ్గరలోని వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. ఆరు నెలలు క్రమం తప్పకుండా మందులు వాడితే క్షయ వ్యాధి నయం చేయవచ్చన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార నిమిత్తం ప్రతి నెలా రూ.500 ప్రభుత్వం రోగి ఖాతాలో జమ చేస్తుందన్నారు. టీచర్లందరూ క్షయ వ్యాధి నివారణలో తమ వంతు పాత్ర పోషించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో హెచ్‌ఎం విశ్వనాధం గుప్తా, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read more