పూర్తికావచ్చిన గ్రామపంచాయతీ భవన నిర్మాణం

ABN , First Publish Date - 2022-09-14T04:50:06+05:30 IST

‘రేకుల డబ్బాలో పంచాయతీ కార్యాలయం’ అనే శీర్షికన ఆరునెలల క్రితం ఆంధ్రజ్యోతి దినపత్రికలో వార్త ప్రచురితమైంది. ఈ కథనానికి అధికారులు వెంటనే స్పందించి, నిలిచిపోయిన గ్రామపంచాయతీ భవన నిర్మాణాన్ని వేగవంతం చేశారు.

పూర్తికావచ్చిన గ్రామపంచాయతీ భవన నిర్మాణం
ముంగీ్‌సపల్లిలో నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనం

రాయపోల్‌, సెప్టెంబరు 13: ‘రేకుల డబ్బాలో పంచాయతీ కార్యాలయం’ అనే శీర్షికన ఆరునెలల క్రితం ఆంధ్రజ్యోతి దినపత్రికలో వార్త ప్రచురితమైంది. ఈ కథనానికి అధికారులు వెంటనే స్పందించి, నిలిచిపోయిన గ్రామపంచాయతీ భవన నిర్మాణాన్ని వేగవంతం చేశారు. రాయపోల్‌ మండలం ముంగీ్‌సపల్లి గ్రామపంచాయతీగా ఏర్పడింది. ఈ గ్రామంలో పంచాయతీ కార్యాలయం నిర్మాణం కోసం ఆర్‌జీఎ్‌సఏ పథకం కింద రూ.20 లక్షల నిధులు మంజూరయ్యాయి. 2020 సెప్టెంబరు 18న మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేసి నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణాలోపంతో పనులు నత్తనడకన సాగాయి. ఈ క్రమంలో ఆంధ్రజ్యోతిలో ‘రేకుల డబ్బాలో పంచాయతీ కార్యాలయం’ అనే శీర్షికన కథనం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించి పనులను ముమ్మరం చేశారు. 

Read more