భూ ఆక్రమణకు పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-10-04T05:15:12+05:30 IST

మా భూముల్లో దౌర్జన్యంగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బోర్పట్ల గ్రామానికి చెందిన రైతులు జక్క మల్లేశం, గోట్యాల రాందాస్‌ సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

భూ ఆక్రమణకు పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదు
ఎస్పీకి ఇచ్చిన వినతిపత్రాన్ని చూపుతున్న బాధితులు

హత్నూర, అక్టోబరు 3: మా భూముల్లో దౌర్జన్యంగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బోర్పట్ల గ్రామానికి చెందిన రైతులు జక్క మల్లేశం, గోట్యాల రాందాస్‌ సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బోర్పట్ల గ్రామ శివారులోని సర్వే నెంబరు 379/293/294/240లలో గల ప్రభుత్వ భూమిని కొన్నేళ్ల క్రితం మాకు అసైన్డ్‌ చేసి ఇవ్వగా.. అప్పటి నుంచి సేద్యం చేసుకుంటూ జీవిస్తున్నామన్నారు. కాగా ఆ భూమిలో బలవంతంగా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఇదేమని అడిగితే మాపై బలవంతంగా కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. భూ ఆక్రమణకు పాల్పడుతున్న దుర్గారెడ్డితో పాటు హత్నూర పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వీరి వెంట మాజీ ఉప సర్పంచ్‌ విఠల్‌, నాయకులు బాలాజీ తదితరులు ఉన్నారు. 


Read more