గ్రామస్థుల ఐక్యతతోనే రైతులకు పరిహారం: ఎంపీపీ

ABN , First Publish Date - 2022-09-18T05:28:58+05:30 IST

బొంతపల్లి పారిశ్రామిక ప్రాంతంలో వివిధ పరిశ్రమల రసాయన జలాల మూలంగా పంట నష్టపోయిన రైతులకు ఏటా పరిశ్రమల నుంచి గ్రామ రైతు కాలుష్య నియంత్రణ కమిటీ ద్వారా పరిహారాన్ని అందిస్తున్నారు.

గ్రామస్థుల ఐక్యతతోనే రైతులకు పరిహారం: ఎంపీపీ

 గుమ్మడిదల, సెప్టెంబరు 17: బొంతపల్లి పారిశ్రామిక  ప్రాంతంలో వివిధ పరిశ్రమల రసాయన జలాల మూలంగా పంట నష్టపోయిన రైతులకు ఏటా పరిశ్రమల నుంచి  గ్రామ రైతు కాలుష్య నియంత్రణ కమిటీ ద్వారా పరిహారాన్ని అందిస్తున్నారు. బొంతపల్లి గ్రామ రైతులు, ప్రజలు,  నాయకులు ఐకమత్యంతో ఉండటం వల్లే  రైతులకు నష్టపరిహారం అందుతున్నదని ఎంపీపీ ప్రవీణ భాస్కర్‌ రెడ్డి, గ్రామ సర్పంచ్‌  ఆలేటి నవీనా శ్రీనివా్‌సరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం బొంతపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో కాలుష్యంతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెక్కులను ఎంపీపీ, సర్పంచ్‌ ఆలేటి నవీనా శ్రీనివాస్‌ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నాగేందర్‌గౌడ్‌ కాలుష్య నియంత్రణ గ్రామ కమిటీ అధ్యక్షుడు కావలి రాజు ఉప సర్పంచ్‌ సంజీవరెడ్డి, ఆలయ కమిటీ మాజీ సభ్యులు పాల్గొన్నారు.


 

Read more