ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చిన సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-09-28T04:59:49+05:30 IST

అక్బర్‌పేట-భూంపల్లి మండలంగా ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్‌ ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ తీర్చారని డీసీసీబీ డైరెక్టర్‌ బక్కి వెంకటయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ శేర్ల కైలాష్‌ అన్నారు.

ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చిన సీఎం కేసీఆర్‌
కేసీఆర్‌, హరీశ్‌రావు, ప్రభాకర్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న ప్రజాప్రతినిధులు

మిరుదొడ్డి, సెప్టెంబరు 27: అక్బర్‌పేట-భూంపల్లి మండలంగా ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్‌ ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ తీర్చారని డీసీసీబీ డైరెక్టర్‌ బక్కి వెంకటయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ శేర్ల కైలాష్‌ అన్నారు. మంగళవారం నూతనంగా ఏర్పాటైన అక్బర్‌పేట-భూంపల్లి మండల కేంద్రంలో టపాసులను పేల్చి, సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. గతంలో మంత్రి హరీశ్‌రావు, ప్రభాకర్‌రెడ్డి ఇచ్చిన హామీమేరకు సీఎం కేసీఆర్‌ను ఒప్పించి మండల ఏర్పాటు కృషి చేశారన్నారు. ఉమ్మడి జిల్లాలోనే అక్బర్‌పేట-భూంపల్లి మండలం శేరవేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సుగుణ, గుండాశంకర్‌, కుమార్‌, శ్రీనివాస్‌, యాదగిరి, బాలమణిమల్లేశం, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బాలమల్లేశం, చంద్రసాగర్‌, టెలికాం బోర్డు సభ్యుడు శ్రీనివా్‌సగౌడ్‌ పాల్గొన్నారు. 

మండల ఏర్పాటుకు ఎమ్మెల్యే కృషి

మిరుదొడ్డి, సెప్టెంబరు 27: అక్బర్‌పేట-భూంపల్లి మండల ఏర్పాటుకు ఎమ్మెల్యే రఘునందన్‌రావు కృషి చేశారని బీజేపీ జిల్లా కార్యదర్శి మల్లన్నగారి భిక్షపతి అన్నారు.  మంగళవారం నూతనంగా ఏర్పాటైన అక్బర్‌పేట-భూంపల్లిలోని అతిథి గృహంలో ఆయన బీజేపీ నాయకులతో కలిసి మాట్లాడారు. గత ఉపఎన్నికల్లో ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఇచ్చిన హామీని నెరవేర్చారన్నారు. ఇక్కడి మండల ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారని గుర్తుచేశారు. ఈ సమావేశంలో పోతరెడ్డిపేట సర్పంచ్‌ శంకర్‌, నాయకులు యాదగిరి, సాయిలు పాల్గొన్నారు. 

Read more