మిరుదొడ్డిలో చైన్‌ స్నాచింగ్‌

ABN , First Publish Date - 2022-10-01T04:41:53+05:30 IST

బీడీలు చుడుతున్న మహిళ మెడలో నుంచి ఐదు తులాల బంగారు పుస్తెలతాడును ఎత్తుకెళ్లిన సంఘటన మిరుదొడ్డిలో శుక్రవారం చోటుచేసుకుంది.

మిరుదొడ్డిలో చైన్‌ స్నాచింగ్‌

పోలీ్‌సస్టేషన్‌కు కూత వేటు దూరంలో ఘటన

మిరుదొడ్డి, సెప్టెంబరు 30: బీడీలు చుడుతున్న మహిళ మెడలో నుంచి ఐదు తులాల బంగారు పుస్తెలతాడును ఎత్తుకెళ్లిన సంఘటన మిరుదొడ్డిలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత మహిళ శకుంతల తెలిపిన వివరాల ప్రకారం... ఇంటి బయట బీడీలను చుడుతుండగా, ఓ అగంతకుడు వచ్చి మెడలో నుంచి పుస్తెల తాడును లాగడంతో ఆమె గట్టిగా పుస్తెలతాడును పట్టుకుంది. దీంతో సుమారు 4 తులాల వరకు గల పుస్తెలతాడును లాక్కోని బైక్‌పై పోలీ్‌సస్టేషన్‌ ముందు నుంచే పరారయ్యాడు. దీంతో మహిళ అరుపులు, కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రాగా, అప్పటిగే అగంతకుడు పారిపోయాడు. బాధితురాలు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా పోలీ్‌సస్టేషన్‌కు కూత వేటు దూరంలో చైన్‌ స్నాచింగ్‌ జరగడం మండలంలో చర్చనీయాంశమైంది. మిరుదొడ్డిలో, పోలీ్‌సస్టేషన్‌ ఎదుట సీసీ కెమెరాలు ఉన్నా.. అవి పని చేయడం లేదు.

Read more