గడపగడపకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు

ABN , First Publish Date - 2022-06-08T05:03:53+05:30 IST

సుపరిపాలన బీజేపీతోనే సాధ్యమని, ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్తామని బీజేపీ మెదక్‌ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

గడపగడపకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు

బీజేపీ మెదక్‌ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌

మెదక్‌ అర్బన్‌, జూన్‌ 7: సుపరిపాలన బీజేపీతోనే సాధ్యమని, ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్తామని బీజేపీ మెదక్‌ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన భారత్‌ వికాస్‌ తీర్ధ బైక్‌ యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రం మెదక్‌ రైల్వే సేష్టన్‌కు రూ.218 కోట్లు మంజూరు చేసిందన్నారు. స్టేడియంలో సింథటిక్‌ ట్రాక్‌ కోసం కేలో ఇండియా ద్వారా రూ. 7 కోట్లను, బాల్‌నగర్‌ నుంచి మెదక్‌ వరకు జాతీయ రహదారి నిర్మాణం కోసం రూ. 423 కోట్లను కేంద్రం కేటాయించిందన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను ఆర్థికంగా దివాలా తీసి అప్పుల పాలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్ధన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు విజయ్‌, సురేష్‌, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు ఉదయ్‌కిరణ్‌, ఉపాధ్యక్షులు సత్యపాల్‌, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Read more