మొక్కల సంరక్షణను కర్తవ్యంగా భావించాలి

ABN , First Publish Date - 2022-07-19T05:18:33+05:30 IST

ప్రతిఒక్కరూ నాటిన మొక్కలను సంరక్షించడం తమ కర్తవ్యంగా భావించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత అన్నారు.

మొక్కల సంరక్షణను కర్తవ్యంగా భావించాలి

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత 

హుస్నాబాద్‌, జూలై 18 : ప్రతిఒక్కరూ నాటిన మొక్కలను సంరక్షించడం తమ కర్తవ్యంగా భావించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత అన్నారు. సోమవారం హుస్నాబాద్‌ పట్టణంలోని బుడిగ జంగాల కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఇంటికి ఐదు మొక్కలను పంపిణీ చేస్తున్నామని, వీటిని నాటి సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రాజు, శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.

కోహెడ: ప్రతిఒక్కరూ తమ ఇల్లు, పొలాలు, ఇతర ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని పీఏసీఎస్‌ చైర్మన్‌ పేర్యాల దేవేందర్‌రావు అన్నారు. సోమవారం సర్పంచ్‌ నవ్యతో కలిసి కోహెడ మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోహెడ ఉపసర్పంచ్‌ యాద అశోక్‌ పాల్గొన్నారు. 

మిరుదొడ్డి: నాటిన ప్రతిమొక్కను సంరక్షించాలని టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు సిద్దిభూపతిగౌడ్‌ అన్నారు. సోమవారం మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామంలో మహిళలకు పెరటి మొక్కలను పంపిణీ చేశారు. 

Read more