తాళం వేసిన రెండు ఇళ్లల్లో చోరీ

ABN , First Publish Date - 2022-09-10T05:51:43+05:30 IST

తాళం వేసిన రెండు ఇళ్లల్లో గురువారం అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు.

తాళం వేసిన రెండు ఇళ్లల్లో చోరీ

రూ. 52 వేల నగదు, 8 తులాల బంగారం అపహరణ

నర్సాపూర్‌, సెప్టెంబరు 9: తాళం వేసిన రెండు ఇళ్లల్లో గురువారం అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. నర్సాపూర్‌లోని పెద్దమ్మకాలనీలో భానుప్రసాద్‌గౌడ్‌ తాళం వేసి ఊరికి వెళ్లాడు. కాగా తాళాన్ని రాడు సహాయంతో తొలగించి బీరువాలో ఉన్న రూ.50వేల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అదే కాలనీలో రాజేశ్‌, మహేష్‌ అనే ఇద్దరు అన్నదమ్ములు(బ్యాచ్‌లర్లు) తాళం వేసి ఊరికి వెళ్లగా, వారి ఇంట్లోకి చొరబడి రూ.2 వేల నగదును ఎత్తుకెళ్లారు. కాగా నర్సాపూర్‌లో వారం రోజుల్లోనే మూడు సార్లు దొంగతనాలు జరగడంతో పట్టణవాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారం క్రితం పెద్దమ్మకాలనీలోనే ఏడు ఇళ్లల్లో చోరీకి పాల్పడగా, రెండు రోజుల క్రితం పాండు ఇంట్లో చోరీ చేసిన సంఘటనలు మరువకముందే గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పెద్దమ్మకాలనీలోని రెండు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. కాగా దొంగలు తాళాలు ఉన్న ఇళ్లను ఎంచుకుని, ఇరుగు పొరుగు వారు బయటకు రాకుండా వారి ఇళ్లకు బయటి నుంచి గొళ్లెం పెట్టి మరీ దొంగతనాలు చేస్తున్నారు. చోరీలకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

Read more