పూల సంబురం

ABN , First Publish Date - 2022-10-02T05:09:57+05:30 IST

చిన్నకోడూరు మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లో, నంగునూరు మండలం రాజగోపాల్‌పేటలో, కొండపాక మండలకేంద్రంతో పాటు దమ్మక్కపల్లి, కొమురవెల్లి మండలం తపా్‌సపల్లి గ్రామంలో శనివారం సద్దుల బతుకమ్మ సంబురాలను ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు.

పూల సంబురం
కొండపాకలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

పలు గ్రామాల్లో ఏడోరోజునే సద్దుల బతుకమ్మ

చిన్నకోడూరు/నంగునూరు/కొండపాక/చేర్యాల/సిద్దిపేట క్రైం/గజ్వేల్‌, అక్టోబరు 1: చిన్నకోడూరు మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లో, నంగునూరు మండలం రాజగోపాల్‌పేటలో, కొండపాక మండలకేంద్రంతో పాటు దమ్మక్కపల్లి, కొమురవెల్లి మండలం తపా్‌సపల్లి గ్రామంలో శనివారం సద్దుల బతుకమ్మ సంబురాలను ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు. సాధారణంగా బతుకమ్మ పండుగను అన్ని గ్రామాల్లో తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. కానీ ఇందుకు భిన్నంగా ఏడు రోజుల్లోనే ఈ గ్రామాల్లో సద్దుల బతుకమ్మను జరుపుకోవడం ఆచారం. ఏడు అనే అంకెను ఈ గ్రామాల ప్రజలు శుభ సూచకంగా భావిస్తారు. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రంగురంగుల పూలను సేకరించి పెద్ద బతుకమ్మలను పేర్చి గ్రామ కూడలిలో పెట్టి ఆడారు. పోయిరా బతుకమ్మ... పోయి రావమ్మ అంటూ చెరువుల్లో నిమజ్జనం చేశారు. అనంతరం వెంట తెచ్చుకున్న ఫలహారాలను ఒకరికొకరు వాయినంగా ఇచ్చి పుచ్చుకున్నారు. కొండపాకలో జడ్పీటీసీ అశ్విని, సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు చిట్టి మాధురి, ఎంపీటీసీ అనసూయ బతుకమ్మ ఆడారు. బతుకమ్మ సంబురాల్లో డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, అనంతుల ప్రశాంత్‌, మాజీ ఎంపీపీ కనకయ్య పాల్గొన్నారు. 

పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో..

సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో శనివారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీసీ శ్వేత, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, ఆయన సతీమణి జ్యోతి బతుకమ్మ సంబరాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహిళా పోలీస్‌ అధికారులు, సిబ్బంది, పోలీస్‌ కుటుంబసభ్యులు వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గజ్వేల్‌లోని ఐవోసీ కాంప్లెక్స్‌లో ‘గడ’ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, ‘గడ’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, గజ్వేల్‌ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, ఎంపీపీ దాసరి అమరావతి ఆధ్వర్యంలో ఆయా శాఖల ఉద్యోగినులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. వారివెంట తహసీల్దార్‌ బాల్‌రాజు, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీధర్‌, పీఆర్‌ డీఈఈ అజయ్‌, ఎంపీడీవో మచ్చేందర్‌, కౌన్సిలర్లు రజిత, చందన, విద్యారాణి, అధికారులు పాల్గొన్నారు.

Read more