రక్తదానం.. ప్రాణదానంతో సమానం

ABN , First Publish Date - 2022-08-18T05:04:19+05:30 IST

రక్త దానం... ప్రాణదానంతో సమానమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ పేర్కొన్నారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం సంగారెడ్డి ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. రక్తదానంతో ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడిన వారమవుతామన్నారు. అనంతరం రక్తదానం చేసినవారికి

రక్తదానం.. ప్రాణదానంతో సమానం

సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌

సంగారెడ్డి అర్బన్‌/సంగారెడ్డిరూరల్‌,  ఆగస్టు17: రక్త దానం... ప్రాణదానంతో సమానమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ పేర్కొన్నారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం సంగారెడ్డి ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. రక్తదానంతో ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడిన వారమవుతామన్నారు. అనంతరం రక్తదానం చేసినవారికి ప్రశంసాపత్రాలను అందజేశారు. శిబిరంలో 104 మంది రక్తదానం చేసినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అనీల్‌ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వాణి, డీఆర్‌డీవో శ్రీనివాసరావు, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ గాయత్రీదేవీ, ఆర్డీవో నగేశ్‌, ఆర్‌ఎంవో రవికుమార్‌, డాక్టర్‌ గోవింద్‌, బ్లడ్‌బ్యాంకు సిబ్బంది రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే, సంగారెడ్డి పోలీస్‌ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎస్పీ రమణకుమార్‌ పరిశీలించారు. రక్తదానం చేసిన పోలీసు సిబ్బంది, యువతను అభినందించారు. శిబిరంలో ఆర్‌ఐ కృష్ణ, సంగారెడ్డి రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివా్‌సరెడ్డి, ఆర్‌ఎ్‌సఐ మహేశ్వర్‌రెడ్డి, పోలీస్‌ సిబ్బంది కృష్ణ, మహేందర్‌, వెంకటేశ్‌, 18వ వార్డు కౌన్సిలర్‌ అశ్విన్‌ తదితరులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో డా.జ్యోతి, సంగారెడ్డి డీఎస్పీ రవీంద్రారెడ్డి, ఏఆర్‌డీఎస్పీ జనార్దన్‌, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ మహే్‌షగౌడ్‌, సంగారెడ్డి రూరల్‌, పట్టణ సీఐలు శివలింగం, రమేష్‌, ఆర్‌ఐలు హరిలాల్‌, డానియెల్‌, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

మెదక్‌లో..

మెదక్‌ అర్బన్‌, ఆగస్టు 17: మెదక్‌లోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో బుధవారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని మెదక్‌ జిల్లా అదనపు కల్టెర్‌ ప్రతిమాసింగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యంగా యువత రక్తదానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని, రక్తదానంపై ఆపోహలను తొలగించాలని పిలుపునిచ్చారు. అరోగ్యంగా ఉన్నవారు డాక్టర్ల సూచనలమేరకు నిరభ్యంతరంగా రక్తదానం చేయవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు, సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌, డాక్టర్లు శివదయాల్‌, నవీన్‌కుమార్‌, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌, అధికారులు, యువకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T05:04:19+05:30 IST