పేద ప్రజలకు అండగా బీజేపీ

ABN , First Publish Date - 2022-09-11T04:49:09+05:30 IST

పేదలకు అండగా బీజేపీ నిలబడుతుందని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. శనివారం వెంకటాపూర్‌ గ్రామంలో నిర్వహించిన ప్రజాగోస-బీజేపీ భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

పేద ప్రజలకు అండగా బీజేపీ
వెంకటాపూర్‌ గ్రామంలో ప్రజాగోస-బీజేపీ భరోసా బైక్‌ ర్యాలీలో పాల్గొన్న నాయకులు

  మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు


సదాశివపేట రూరల్‌, సెప్టెంబరు 10: పేదలకు అండగా బీజేపీ నిలబడుతుందని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. శనివారం వెంకటాపూర్‌ గ్రామంలో నిర్వహించిన ప్రజాగోస-బీజేపీ భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో రామచంద్రరావు మాట్లాడుతూ.. నరేంద్రమోదీ పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బూటకపు హామీలతో కాలక్షేపం చేస్తున్నదని మండిపడ్డారు. అవినీతి, కుటుంబ పరిపాలనకు తెలంగాణ వేదికగా మారిందని విమర్శించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, జిల్లా సహాయ ఇన్‌చార్జి రామకృష్ణ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల జిల్లా ఇన్‌చార్జి చంద్రశేఖర్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విష్ణువర్ధన్‌రెడ్డి, కోవూరి సంగమేశ్వర్‌, సత్యనారాయణ, జంజిరాల విజయ్‌కుమార్‌, మండల పార్టీ అధ్యక్షులు అంబదాస్‌, శివరాజ్‌ పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు.


 

Read more