బీజేపీది కాపీ పేస్ట్‌ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-09-27T04:56:06+05:30 IST

తెలంగాణ ప్రభుత్వ పథకాలను కేంద్రం కాపీ కొడుతున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

బీజేపీది కాపీ పేస్ట్‌ ప్రభుత్వం
సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరిన నాయకులు

సిద్దిపేట టౌన్‌, సెప్టెంబరు 26: తెలంగాణ ప్రభుత్వ పథకాలను కేంద్రం కాపీ కొడుతున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సిద్దిపేట అర్బన్‌ మండలం బక్రిచెప్యాల, పట్టణంలోని 37వ వార్డుకు చెందిన బీజేపీ, కాంగ్రె్‌సకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరగా, వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ ఆలోచించి, ప్రజల్లో నిజాన్ని తెలియజెప్పాలన్నారు. బీజేపీ జిల్లా నాయకుడు నరేష్‌ ఆధ్వర్యంలో, కాంగ్రెస్‌ నాయకుడు చైతు ఆధ్వర్యంలో టీఆర్‌ఎ్‌సలో చేరిన వారికి శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు.  

సిద్దిపేటలో విశ్వశాంతి మహాయాగం

సిద్దిపేట టౌన్‌, సెప్టెంబరు 26: సిద్దిపేట పట్టణంలోని వేములవాడ కమాన్‌ వద్ద నున్న మైదానంలో నంబరు 19 నుంచి డిసెంబరు 2 వరకు శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానందస్వామి పర్యవేక్షణలో ఆయుత చండీ అతిరుద్ర యాగం జరుగనున్నది. సోమవారం ఈ కార్యక్రమంపై సిద్దిపేటకు విచ్చేసిన స్వామి ఆశీస్సులను మంత్రి హరీశ్‌రావు తీసుకుని మాట్లాడారు. సిద్దిపేట 2013లో స్వామివారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ కృష్ణ కాలచక్రం, అతిరుద్ర యాగం అద్భుతంగా జరిగిందన్నారు. ఆ సంకల్పంతో రాష్ట్ర ఆవిర్భావం జరిగిందని గుర్తుచేశారు. వచ్చేనెల 6న కార్యక్రమ భూమిపూజలో పాల్గొంటానని వివరించారు. సిద్దిపేటలో 78వ విశ్వశాంతి మహాయగం నిర్వహించడం, అదేవిధంగా శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం జరగడం విశేషమని వివరించారు. అనంతరం యాగానికి సంబంధించి కరపత్రాన్ని ఆవిష్కరించారు.  

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

నంగునూరు, సెప్టెంబరు 26: రైతు సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం ద్వారా ప్రతి ఎకరాకు సాగు అందించిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనని చెప్పారు. సోమవారం నంగునూరు మండలం అంక్షాపూర్‌, ఖానాపూర్‌లో డంపింగ్‌యార్డు, రైతువేదిక, పల్లె ప్రకృతివనం, ఓపెన్‌ జిమ్‌, ఖానాపూర్‌ నుంచి మైసంపల్లి వెళ్లే బీటీరోడ్డు మరమ్మతు పనులు, గ్రామపంచాయతీ మీటింగ్‌హాల్‌తో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అంక్షాపూర్‌లో 22 వేల ఎకరాల సాగు చేస్తున్నామన్నారు. కాళేశ్వరం నీళ్లతో ప్రతి గుంటకు సాగునీరు అందిస్తున్నామని చెప్పారు. రూ.300ల కోట్లతో నర్మెటలో పామాయిల్‌ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నామని చెప్పారు. ఆదాయం వచ్చే పంటలపై మొగ్గు చూపాలని కోరారు. బోరు ఎండకుండా, బావిలో నీరు దంగకుండా ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్నామన్నారు. ఇంటి అడుగు జాగాలో ఇల్లు కట్టుకుంటే మూడు లక్షలు ఇస్తామని చెప్పారు. ఖానాపూర్‌ గ్రామానికి 50 ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. కాల్వల నిర్మాణం కోసం భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకురావాలని, వారికి తగిన నష్టపరిహారం అందేలా కృషిచేస్తామని హామీఇచ్చారు. వచ్చే యాసంగికల్లా ప్రతి గ్రామానికి కాల్వల ద్వారా సాగునీరు తెచ్చి చెరువులు, కుంటలు నింపుతామని తెలిపారు. ఆయా గ్రామాల సర్పంచులు శ్రీనివా్‌సరెడ్డి, ఐలేని సత్తవ్వ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్‌ ఎడ్ల సోమిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్లు కొల రమే్‌షగౌడ్‌, ఎల్లంకి మహిపాల్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. 

Read more