బెల్టు షాపులను మూసివేయాలి

ABN , First Publish Date - 2022-11-24T22:59:15+05:30 IST

గ్రామంలో బెల్టు షాపులను మూసివేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం మండల పరిధిలోని పాతూర్‌లో గ్రామస్థులు ధర్నాకు దిగారు.

బెల్టు షాపులను మూసివేయాలి
పాతూర్‌లో రోడ్డుపై ధర్నా చేస్తున్న గ్రామస్థులు

మెదక్‌ అర్బన్‌, నవంబరు 24: గ్రామంలో బెల్టు షాపులను మూసివేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం మండల పరిధిలోని పాతూర్‌లో గ్రామస్థులు ధర్నాకు దిగారు. దాదాపు గంటపాటు మెదక్‌-రామాయంపేట రహదారిపై బైఠాయించారు. యువత మద్యానికి బానిసై కన్నవారికి కడుపు కోతను మిగులిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో మద్యానికి బానిసై యువకుడు మృతి చెందాడని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి బెల్టుషాపులను నిర్మూలించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న రూరల్‌ ఎస్‌ఐ మోహన్‌రెడ్డి ధర్నా చేస్తున్న గ్రామస్థులను సముదాయించారు. బెల్టుషాపులను మూసివేయిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

Updated Date - 2022-11-24T22:59:15+05:30 IST

Read more