కలెక్టరేట్‌లలో బతుకమ్మ సంబురాలు

ABN , First Publish Date - 2022-09-29T05:02:38+05:30 IST

సంగారెడ్డి, మెదక్‌ కలెక్టరేట్‌లలో బుధవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు.

కలెక్టరేట్‌లలో బతుకమ్మ సంబురాలు
సంగారెడ్డి కలెక్టరేట్‌లో బతుకమ్మ ఆడుతున్నఅధికారులు, ఉద్యోగులు, చిన్నారులు

  సంగారెడ్డిరూరల్‌/మెదక్‌అర్బన్‌,సెప్టెంబరు28: సంగారెడ్డి, మెదక్‌ కలెక్టరేట్‌లలో బుధవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఆయా కలెక్టరేట్‌లలోని వివిధ శాఖలకు చెందిన మహిళాఅధికారులు, ఉద్యోగులు, సిబ్బంది వివిధరకాల పూలతో బతుకమ్మను పేర్చి ఆడు తూ పాడుతూ ఉల్లాసంగా గడిపారు. మెదక్‌ జిల్లామహిళా శిశు సంక్షేమశాఖ, వ్యవసాయ, ఉద్యానశాఖ  ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఆవరణలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. వేడుకల్లో ఆయా జిల్లాల స్త్రీ మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీటీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

Read more