పలు గ్రామాల్లో ఘనంగా బతుకమ్మ సంబురాలు

ABN , First Publish Date - 2022-09-29T05:02:29+05:30 IST

హత్నూరలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పాల్గొన్నారు.

పలు గ్రామాల్లో ఘనంగా బతుకమ్మ సంబురాలు
జహీరాబాద్‌లో బతుకమ్మ ఆడుతున్న విద్యార్థులు

జహీరాబాద్‌/హత్నూర, సెప్టెంబరు 28: హత్నూరలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఆంజనేయులు, ఎంపీపీ అధ్యక్షుడు వావిలాల నర్సింలు, పీఏసీఎస్‌ చైర్మన్‌ దుర్గారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి, సర్పంచ్‌ వీరస్వామిగౌడ్‌, ఐకేపీ ఏపీఎం శ్రీదేవి పాల్గొన్నారు. జహీరాబాద్‌ పట్టణంలోని ఆచార్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుమతి, కళాశాల ప్రిన్సిపాల్‌ హరికుమార్‌, డైరెక్టర్స్‌ వెంకట్‌రాంమిరెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.


ఆస్ట్రేలియాలో బతుకమ్మ సంబురాలు


చిన్నశంకరంపేట: ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌ టీఎస్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం బతుకమ్మ సంబురాలను నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలంలోని గవ్వలపల్లి గ్రామానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మెదక్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏకే గంగాధర్‌రావు కుమారుడు సంతో్‌షరావు, కమిటీ సభ్యులతో కలిసి బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. కమిటీ సభ్యులు మాధవి, శివాణి, లక్ష్మి, భార్గవి, శ్రీకాంత్‌ పాల్గొన్నారు. 


 Read more