బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

ABN , First Publish Date - 2022-06-08T04:55:49+05:30 IST

బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని డీపీవో దేవకీదేవి అన్నారు.

బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి
హుస్నాబాద్‌ మండలం కూచనపల్లిలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న డీపీవో, ఉపాధ్యాయులు

డీపీవో దేవకీదేవి

హుస్నాబాద్‌రూరల్‌, జూన్‌ 7: బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని డీపీవో దేవకీదేవి అన్నారు. మంగళవారం పల్లెప్రగతిలో భాగంగా పోతారం(ఎస్‌), కూచనపల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కార్యక్రమంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత దుస్తులు, పాఠ్యపుస్తకాల విద్యాబోధన అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా పోతారం(ఎస్‌) ప్రాథమిక పాఠశాలలో 10 మంది నూతన విద్యార్థులను చేర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో సత్యనారాయణ, సర్పంచులు, ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సిద్దిపేట రూరల్‌: సిద్దిపేట రూరల్‌ మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచులు, ఇర్కోడ్‌ మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌, ఎంపీటీసీలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ప్రభుత్వ పాఠశాలలో లభించే సేవలపై వివరించారు. జిల్లా కోఆర్డినేటర్‌ పూర్ణ చందర్‌రావు పలు గ్రామాల్లో జరిగిన బడిబాటలో పాల్గొన్నారు.

Updated Date - 2022-06-08T04:55:49+05:30 IST