అయ్యప్పస్వాముల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-12-30T23:50:14+05:30 IST

అయ్యప్ప మాలఽధారణ చేసిన స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్‌ ఇటీవల వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో జరిగిన ఓ సమావేశంలో అయ్యప్ప జననంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

అయ్యప్పస్వాముల ఆగ్రహం
పెద్దశంకరంపేటలో ధర్నా చేస్తున్న అయ్యప్ప దీక్షాధారులు

మెదక్‌ అర్బన్‌/సంగారెడ్డి రూరల్‌/చిన్నశంకరం పేట/జహీరాబాద్‌/వెల్దుర్తి/తూప్రాన్‌/శివ్వంపేట/కంగ్టి/రేగోడు/పాపన్నపేట/హత్నూర/గుమ్మడిదల/నర్సాపూర్‌/పెద్దశంకరంపేట/నారాయణఖేడ్‌/ జిన్నారం, డిసెంబరు 30: అయ్యప్ప మాలఽధారణ చేసిన స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్‌ ఇటీవల వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో జరిగిన ఓ సమావేశంలో అయ్యప్ప జననంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై మెదక్‌, సంగారెడ్డి జిల్లాలో అయ్యప్ప స్వాములు, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌, పలు పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పలు పట్టణాలు, గ్రామాల్లో అయ్యప్ప స్వాములు ర్యాలీలు నిర్వహించారు. బైరీ నరే్‌షను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు ప్రాంతాల్లో బైరీ నరేష్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.

Updated Date - 2022-12-30T23:50:14+05:30 IST

Read more