సంగారెడ్డి పోలీసు కార్యాలయంలో ఆయుధ పూజ

ABN , First Publish Date - 2022-10-04T05:09:51+05:30 IST

శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు అధికారులు, సిబ్బంది సఫలీకృతమవ్వాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్‌ ఆకాంక్షించారు.

సంగారెడ్డి పోలీసు కార్యాలయంలో ఆయుధ పూజ
సంగారెడ్డి పోలీస్‌ కార్యాలయంలో ఆయుఽధ పూజ చేస్తున్న ఎస్పీ దంపతులు

సంగారెడ్డి రూరల్‌, అక్టోబరు 3: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు అధికారులు, సిబ్బంది సఫలీకృతమవ్వాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్‌ ఆకాంక్షించారు. దుర్గాష్టమి పర్వదినాన్ని పురుస్కరించుకుని సోమవారం సంగారెడ్డిలోని పోలీస్‌ కార్యాలయంలో ఆయుధాలు, వాహనాలకు ఎస్పీ సతీసమేతంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అధికారులు శాంతి భద్రతలను కాపాడేందుకు కృషి చేయాలన్నారు.  కార్యక్రమంలో సంగారెడ్డి డీఎస్పీ రవీంద్రారెడ్డి, ఆర్‌ డీఎస్పీ జనార్దన్‌, ఆర్‌ఐలు కృష్ణ, దానియల్‌, రామారావు, సిబ్బంది  పాల్గొన్నారు.


 జీజీహెచ్‌లో ఆయుధపూజ

సంగారెడ్డి అర్బన్‌, అక్టోబరు 3 : సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో విజయదశమిని పురస్కరించుకొని సోమవారం ఆయుధపూజ నిర్వహించారు. ఆపరేషన్‌ థియేటర్‌, ఐసీయూల్లో వైద్య పరికరాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వాణి, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అనీల్‌కుమార్‌, డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  

Read more