గజ్వేల్‌, హుస్నాబాద్‌కు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు

ABN , First Publish Date - 2022-10-02T05:14:20+05:30 IST

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా పలు విభాగాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 అవార్డులను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రదానం చేయగా జిల్లా నుంచి గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌, హుస్నాబాద్‌ మున్సిపాలిటీకి దక్కాయి. 20 నుంచి 50 వేల జనాభా గల మున్సిపాలిటీ కేటగిరీలో గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ బల్దియాకు బెస్ట్‌ క్లీన్‌ సిటీ అవార్డు లభించింది. బెస్ట్‌ సిటీ ఇన్‌ సిటీజన్స్‌ ఫీడ్‌ బ్యాక్‌ అవార్డుకు హుస్నాబాద్‌ మున్సిపాలిటీ ఎంపికైంది.

గజ్వేల్‌, హుస్నాబాద్‌కు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు
హుస్నాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజితకు అవార్డును ప్రదానం చేస్తున్న కేంద్రమంత్రి కౌషల్‌ కిషోర్‌, పక్కన మంత్రి కేటీఆర్‌

ఢిల్లీలో అందుకున్న మున్సిపల్‌ చైర్మన్లు


హుస్నాబాద్‌/గజ్వేల్‌, అక్టోబరు 1 : ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా పలు విభాగాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 అవార్డులను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రదానం చేయగా జిల్లా నుంచి గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌, హుస్నాబాద్‌ మున్సిపాలిటీకి దక్కాయి. 20 నుంచి 50 వేల జనాభా గల మున్సిపాలిటీ కేటగిరీలో గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ బల్దియాకు బెస్ట్‌ క్లీన్‌ సిటీ అవార్డు లభించింది. బెస్ట్‌ సిటీ ఇన్‌ సిటీజన్స్‌ ఫీడ్‌ బ్యాక్‌ అవార్డుకు హుస్నాబాద్‌ మున్సిపాలిటీ ఎంపికైంది. కాగా శనివారం ఢిల్లీలోని తల్కటోర స్టేడియంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు. కేంద్ర హౌజింగ్‌ అండ్‌ అర్బన్‌ అఫైర్స్‌ మంత్రి కౌషల్‌ కిషోర్‌ నుంచి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, కమిషనర్‌ రాజమల్లయ్య ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గజ్వేల్‌ - ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సి.రాజమౌలి, కమిషనర్‌ పాతూరి గణేశ్‌రెడ్డి బెస్ట్‌ అవార్డును కేంద్ర మంత్రి కౌషల్‌ కిషోర్‌ నుంచి అందుకున్నారు. హుస్నాబాద్‌ మున్సిపాలిటీకి గత సంవత్సరం కూడ ఫాసెస్ట్‌ మూవ్‌ సిటీగా అవార్డును అందుకున్నది. రెండోసారి అవార్డు రావడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.





Updated Date - 2022-10-02T05:14:20+05:30 IST