వ్యక్తిపై దాడి, 15 మంది అరెస్టు

ABN , First Publish Date - 2022-07-06T05:24:52+05:30 IST

దుబ్బాక మండలం బల్వాంతాపూర్‌ వడ్డెర కాలనీలో ఒక వ్యక్తిపై దాడిచేసిన కేసులో 15 మందిని అరెస్టు చేసినట్టు దుబ్బాక ఎస్‌ఐ మహెందర్‌ తెలిపారు.

వ్యక్తిపై దాడి, 15 మంది అరెస్టు

దుబ్బాక, జూలై 5: దుబ్బాక మండలం బల్వాంతాపూర్‌ వడ్డెర కాలనీలో ఒక వ్యక్తిపై దాడిచేసిన కేసులో 15 మందిని అరెస్టు చేసినట్టు దుబ్బాక ఎస్‌ఐ మహెందర్‌ తెలిపారు. గ్రామానికి చెందిన ఆశోక్‌ అనే వ్యక్తి అక్రమంగా మట్టి తరలిస్తున్నారనే ఫిర్యాదుతో వారంరోజుల క్రితం కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అయితే అదే వ్యక్తిపై మంగళవారం గ్రామానికి చెందిన 15 మంది అతడితో పాటు భార్య విమల, అక్క కనకవ్వ, అశోక్‌ అన్న కూతరు అఖిలపై దాడిచేయడంతో తీవ్రగాయాలయ్యాయి. కట్టెలతో దాడిచేసి, హత్యాయత్నం చేసిన వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్టు ఎస్‌ఐ తెలిపారు. 

Read more