అసోం సీఎంను అరెస్టు చేయాలి

ABN , First Publish Date - 2022-02-17T04:59:26+05:30 IST

జాతీయ కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హేమంత్‌ బిశ్వశర్మను బర్తరఫ్‌ చేసి వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

అసోం సీఎంను అరెస్టు చేయాలి

జాతీయ కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హేమంత్‌ బిశ్వశర్మను బర్తరఫ్‌ చేసి వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ అసోం సీఎంను బర్తరఫ్‌ చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు  మెదక్‌ జిల్లాలో బుధవారం ఎస్పీ కార్యాలయాల ముట్టిడికి నాయకులు యత్నించగా పోలీసులు అడ్డుకుని ముందస్తు అరెస్టులు చేశారు. 


మెదక్‌, ఫిబ్రవరి 16: డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఆయనతో పాటు కౌన్సిలర్‌ రాజలింగం, జిల్లా కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మామిళ్ల ఆంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలో మ్యాడం బాలకృష్ణ, ఆవుల రాజిరెడ్డి, ఆంజనేయులుగౌడ్‌, రవీందర్‌రెడ్డి, బాలకృష్ణ, హఫీజ్‌ ఉద్దీన్‌, రమే్‌షరెడ్డి, రాజాలింగం, అవారి శేఖర్‌, గూడూరి ఆంజనేయులు, గోవర్ధన్‌, స్వామి, చింతల యాదగిరి, శ్యాంసుందర్‌, అనిల్‌, భరత్‌, సంజీవ్‌, బాబు, రమేష్‌, రాములు, రవీందర్‌, ప్రభాకర్‌, తహేర్‌, లాలూ, కేషవులు, ఉదయ్‌, అజయ్‌గౌడ్‌ ఇతరులు పాల్గొన్నారు. 

పెద్దశంకరంపేట: కాంగ్రె్‌సపార్టీ పట్టణాధ్యక్షుడు గంగారెడ్డి, నాయకులు జైపాల్‌గౌడ్‌, రాందాస్‌, సాయిలు, వసీంను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. 

వెల్దుర్తి: కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు నర్సింహారెడ్డి, మండల సహకార బ్యాంకు డైరెక్టర్‌ కృష్ణాగౌడ్‌ను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. 

రామాయంపేట: టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హవేళిఘణపూర్‌: మండల కాంగ్రెస్‌ నాయకులు లక్కరు శ్రీనివాస్‌, మహేష్‌, భూపతియాదవ్‌, పద్మరావు తదితరులను  పోలీసులు అరెస్టు చేశారు.

పాపన్నపేట: జిల్లా కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్‌, మండల సీనియర్‌ నాయకులు శ్రీకాంత్‌, గోవింద్‌ నాయక్‌, ఖలీం, ఖరోద్దీన్‌, యూత్‌ విభాగం జిల్లా కార్యదర్శి ప్రేమ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

నర్సాపూర్‌: నర్సాపూర్‌కు చెందిన నాయకులు సురేష్‌, శివతో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. 


 

Updated Date - 2022-02-17T04:59:26+05:30 IST