వజ్రోత్సవాల్లో భాగంగా 21న పెద్దఎత్తున మొక్కలను నాటాలి

ABN , First Publish Date - 2022-08-18T04:51:37+05:30 IST

స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 21న పెద్దఎత్తున హరితహారంలో మొక్కలను నాటాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం స్పెషల్‌ ఫారెస్ట్‌ చీఫ్‌ సెక్రటరీ శాంతి కుమారితో కలిసి మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

వజ్రోత్సవాల్లో భాగంగా 21న పెద్దఎత్తున మొక్కలను నాటాలి

వీడియో కాన్ఫరె న్స్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి


సిద్దిపేట అగ్రికల్చర్‌, ఆగస్టు 17 : స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 21న పెద్దఎత్తున హరితహారంలో మొక్కలను నాటాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం స్పెషల్‌ ఫారెస్ట్‌ చీఫ్‌ సెక్రటరీ శాంతి కుమారితో కలిసి మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు వజ్రోత్సవాల ఆఖరి రోజైనా 21న హరితహారం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రీన్‌ రెవల్యూషన్‌లో మమన రాష్ట్రం 33 శాతానికి దగ్గరగా ఉన్నామని మంత్రి పేర్కొన్నారు. అందరూ తమకు దగ్గర్లో అందుబాటులో ఉన్న నర్సరీలో నుంచి మొక్కలు తెచ్చుకోవాలని, ఎక్కువ శాతం పెద్ద మొక్కలు తీసుకొని 21న నాటాలని మంత్రి పిలుపునిచ్చారు. గ్రామాల్లో పచ్చదనం బాగా కనిపిస్తుంది కానీ మున్సిపాలిటీలో స్థలం తక్కువ కారణంగా పచ్చదనం తక్కువగా ఉందన్నారు. మున్సిపాలిటీల్లో అందుబాటులో ఉన్న స్థలాలల్లో మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో సర్పంచ్‌, సెక్రటరీ మొదలుకొని రాష్ట్ర మంత్రుల వరకు అందరూ భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Read more