సీఎం రాక కోసం మల్లన్నసాగర్‌ వద్ద ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-02-20T05:14:54+05:30 IST

మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను జాతికి అంకితం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రానుండటంతో అధికారులు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. మండల పరిధిలోని తుక్కాపూర్‌లో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు వద్ద సీఎం హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ కోసం రెండు హెలిప్యాడ్‌లు ఇప్పటికే సిద్ధంగా ఉండగా.. మరొకటి నిర్మిస్తున్నారు.

సీఎం రాక కోసం మల్లన్నసాగర్‌ వద్ద ఏర్పాట్లు
మల్లన్నసాగర్‌ వద్ద సిద్ధం చేస్తున్న హెలిప్యాడ్‌

తొగుట, ఫిబ్రవరి 19 : మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను జాతికి అంకితం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రానుండటంతో అధికారులు  ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. మండల పరిధిలోని తుక్కాపూర్‌లో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు వద్ద సీఎం హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ కోసం రెండు హెలిప్యాడ్‌లు ఇప్పటికే సిద్ధంగా ఉండగా.. మరొకటి నిర్మిస్తున్నారు. మల్లన్నసాగర్‌ కట్ట వద్దనే జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశమవుతుండటంతో ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. సమావేశ స్థలంలో వీవీఐపీలు, వీఐపీలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజల కోసం వేర్వేరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మల్లన్నసాగర్‌ పంప్‌హౌస్‌ ప్రారంభంచేందుకు సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌ సొరంగంలోకి వెళ్లే దారిలో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. తుక్కాపూర్‌కు వచ్చే రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు.


Read more