రోడ్డు ప్రమాదంలో రాంతీర్థ ఉపసర్పంచ్‌ మృతి

ABN , First Publish Date - 2022-09-20T04:52:09+05:30 IST

నారాయణఖేడ్‌లో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపసర్పంచు మృతిచెందాడు.

రోడ్డు ప్రమాదంలో రాంతీర్థ ఉపసర్పంచ్‌ మృతి

నారాయణఖేడ్‌, సెప్టెంబరు 19: నారాయణఖేడ్‌లో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపసర్పంచు మృతిచెందాడు. స్థానికులు, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం... కంగ్టి మండలం రాంతీర్థ ఉపసర్పంచు జ్ఞానేశ్వర్‌ పాటిల్‌(27) సోమవారం రాత్రి ఖేడ్‌ నుంచి మంగల్‌పేట వైపునకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. పట్టణంలోని ఆక్సీజన్‌ పార్కు ఎదురుగా నిజాంపేట - బీదర్‌ రహదారి పక్కన మిషన్‌ భగీరథ పైపులైన్‌ లీకవ్వడంతో మరమ్మతు కోసం గోతిని తవ్వి పూడ్చలేదు. బైక్‌పై వస్తున్న జ్ఞానేశ్వర్‌ ఎదురుగా వాహనాలు వస్తుండటంతో రోడ్డు కిందకు వెళ్లగా, భగీరథ కోసం తీసిన గోతిలో పడి రోడ్డు పక్కన పడిపోయాడు. ఆ సమయంలో వచ్చిన ఓ వాహనం జ్ఞానేశ్వర్‌పై వెళ్లడంతో తలపగిలి అక్కడిక్కడే మృతిచెదాడు. జ్ఞానేశ్వర్‌ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. 

Read more