రామాయంపేటలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2022-03-19T05:25:15+05:30 IST

పట్టణంలోని ఎస్కలదేవ్‌ బండ వద్ద శుక్రవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది.

రామాయంపేటలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

 రామాయంపేట, మార్చి 18: పట్టణంలోని ఎస్కలదేవ్‌ బండ వద్ద శుక్రవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. శుక్రవారం అటు వైపుగా వెళ్తున్న పలువురు రైతులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు చనిపోయిన వ్యక్తి వయస్సు సుమారు 40 ఏళ్లు ఉంటుందిన, నాలుగు రోజుల కిందట చనిపోయి ఉంటాడని చెప్పారు. ఎస్‌ఐ రాజేశ్‌ మృతదేహం వద్ద ఆధారానలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 


 

Read more