బావిలో పడి వృద్ధుడి గల్లంతు

ABN , First Publish Date - 2022-10-14T05:30:00+05:30 IST

చేర్యాల పట్టణ శివారులోని వ్యవసాయబావిలో ప్రమాదవశాత్తు ఓ వృద్ధుడు జారి గల్లంతయ్యాడు.

బావిలో పడి వృద్ధుడి గల్లంతు

చేర్యాల, అక్టోబరు 14: చేర్యాల పట్టణ శివారులోని వ్యవసాయబావిలో ప్రమాదవశాత్తు ఓ వృద్ధుడు జారి గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామానికి చెందిన ముస్త్యాల బాలమల్లయ్య (65)కు చెందిన బంధువులు చనిపోవడంతో స్నానం చేసేందుకు వెళ్లాడు. బావి గట్టున దుస్తులు పెడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు బాలమల్లయ్య బావిలో పడిపోయాడు. చుట్టుపక్కలవారు గమనించి ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో చేర్యాల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫైర్‌సేఫ్టీ సిబ్బందిని రప్పించి బావిలో వెతికినా జాడ లభించలేదు. దీంతో శనివారం ఉదయం తిరిగి  గాలించనున్నట్టు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. 

Read more