మాసాయిపేటలో గాంధీ విగ్రహానికి అవమానం

ABN , First Publish Date - 2022-11-20T23:49:24+05:30 IST

మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని మాసాయిపేట గ్రామంలో మహాత్మాగాంధీ విగ్రహానికి నల్ల ముసుగును తొడిగి అవమాన పరిచారు.

మాసాయిపేటలో గాంధీ విగ్రహానికి అవమానం
గాంధీ విగ్రహానికి నల్ల ముసుగును తొడుగుతున్న యువకుడు

గాంధీ విగ్రహానికి నల్ల ముసుగును తొడిగిన యువకుడు

పెద్దశంకరంపేట, నవంబరు 20: మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని మాసాయిపేట గ్రామంలో మహాత్మాగాంధీ విగ్రహానికి నల్ల ముసుగును తొడిగి అవమాన పరిచారు. మాసాయిపేట గ్రామానికి చెందిన షానవాజ్‌ అనే యువకుడు శనివారం రాత్రి మహాత్మాగాంధీ విగ్రహానికి ముసుగు కప్పడంతో గ్రామస్థులతో పాటు పలువురు అతడిపై తీవ్రంగా మండిపడ్డారు. రాత్రి సమయంలో పలువురు యువకులు గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని ముచ్చటించుకుంటున్నారు. ఇంతలో షాన్‌వాజ్‌ అనే యువకుడు మహాత్మాగాంధీ విగ్రహానికి నల్ల ముసుగు కప్పాడు. అతడు అధికార పార్టీకి చెందిన మండల పరిషత్‌ కో-ఆప్షన్‌ మెంబర్‌ సోదరుడు కావడంతో రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. గాంధీ విగ్రహానికి నల్ల ముసుగు కప్పిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్‌ అంజిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-11-20T23:49:24+05:30 IST

Read more