అవినీతి, అక్రమాలు లేకుండా డబుల్‌ ఇళ్ల కేటాయింపు

ABN , First Publish Date - 2022-02-17T05:15:06+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం పారదర్శక ప్రభుత్వమని, ఎక్కడా అవినీతి, అక్రమాలకు తావులేకుండా డబుల్‌ ఇళ్లను ఎంపిక చేసిన ఘనత తమదేనని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

అవినీతి, అక్రమాలు లేకుండా డబుల్‌ ఇళ్ల కేటాయింపు
దుబ్బాకలో డబుల్‌ ఇళ్ల కేటాయింపు డ్రాను తీస్తున్న మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు

ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి 

దుబ్బాక, ఫిబ్రవరి 16 : తెలంగాణ ప్రభుత్వం పారదర్శక ప్రభుత్వమని, ఎక్కడా అవినీతి, అక్రమాలకు తావులేకుండా డబుల్‌ ఇళ్లను ఎంపిక చేసిన ఘనత తమదేనని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 589 మంది నిరుపేదలకు మంజూరైన డబుల్‌ ఇళ్ల కేటాయింపును ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి డ్రా తీసి మాట్లాడారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కృషితో డబుల్‌ ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో దుబ్బాక నియోజకవర్గానికి అదనంగా ఇళ్లను మంజూరీ చేశారన్నారు. దుబ్బాకలో 872 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. ఇంకా అర్హుల ఇళ్ల జాబితాలో పేర్లు రాని వారిని గుర్తించి, త్వరలోనే మిగితావారికి ఇళ్లను కేటాయిస్తామన్నారు. ఈనెల 23న సీఎం కేసీఆర్‌ తొగుటలోని మల్లన్నసాగర్‌ను ప్రారంభించనున్నారని తెలిపారు. 

దళారులను నమ్మొద్దు: ఎమ్మెల్యే రఘునందర్‌రావు 

దళారులను నమ్మి మోసపోవద్దని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవా్‌సయోజన కింద నిధులను మంజూరు చేస్తే, వాటికితోడు సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వ వాటాతో డబుల్‌ ఇళ్లను నిర్మించారన్నారు. ప్రతి పేదవాడికి ఇళ్లు అందేలా కృషిచేస్తానన్నారు. ప్రతినెలా 200 చొప్పున ఉగాది వరకు పూర్తిస్థాయి పంపిణీని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, డీఆర్డీఏ పీడీ గోపాల్‌రావు, ఆర్డీవో అనంతరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ వనితారెడ్డి, కమిషనర్‌ గణే్‌షరెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు ఆస యాదగిరి ఉన్నారు. 

Read more