ఎయిర్‌గన్‌ మిస్‌ఫైర్‌... నాలుగేళ్ల బాలిక మృతి

ABN , First Publish Date - 2022-03-17T05:05:50+05:30 IST

ఫౌం హౌస్‌లో ఎయిర్‌ గన్‌ మిస్‌ఫైర్‌ అయి చిన్నారి మరణించిన ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలో బుధవారం జరిగింది.

ఎయిర్‌గన్‌ మిస్‌ఫైర్‌...  నాలుగేళ్ల బాలిక మృతి
మృతి చెందిన శాన్వి

ఫౌంహౌస్‌లో చిన్నారులు ఆడుకుంటుండగా ఘటన 

జిన్నారం, మార్చి 16: ఫౌం హౌస్‌లో ఎయిర్‌ గన్‌ మిస్‌ఫైర్‌ అయి చిన్నారి మరణించిన ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిన్నారం మండలం వావిలాల సమీపంలోని ప్రసాద్‌ ఫౌం హౌస్‌లో మూడు నెలలుగా నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం మోతె గ్రామానికి చెందిన నాగరాజు, సుకన్య దంపతులు పని చేస్తూ అక్కడే ఉంటున్నారు. మంగళవారం ఇంటిని శుభ్రం చేసేందుకని గోడకు తగిలించి ఉన్న ఎయిర్‌గన్‌ను సుకన్య కింద పెట్టింది. కుమార్తె శాన్వి(4), కుమారుడు ప్రేమ్‌కుమార్‌ గన్‌పై కూర్చొని ఆడుకుంటుండగా అది పేలడంతో శాన్వి తలకు తీవ్ర గాయమైంది. వెంటనే తండ్రి నాగరాజు చికిత్స కోసం స్థానిక ప్రైవేట్‌ క్లినిక్‌కు తీసుకెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి, అనంతరం  ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. సంఘటనా స్థలాన్ని జిన్నారం, గుమ్మడిదల ఎస్‌ఐలు సిద్ధిరాములు, విజయకృష్ణ పరిశీలించారు. ఎయిర్‌గన్‌ ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని డీఎస్పీ భీమ్‌రెడ్డి తెలిపారు.  

Read more