బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ

ABN , First Publish Date - 2022-09-27T04:58:24+05:30 IST

బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు.

బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ
ప్రజ్ఞాపూర్‌లో ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ, ఎఫ్‌డీసీ చైర్మన్‌

గజ్వేల్‌/చేర్యాల/హుస్నాబాద్‌/జగదేవ్‌పూర్‌/ములుగు/రాయపోల్‌/కొండపాక/మద్దూరు/వర్గల్‌/బెజ్జంకి, సెప్టెంబరు 26: బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో, గజ్వేల్‌ పట్టణంలోని కోటమైసమ్మ వద్ద చాకలి ఐలమ్మ 127వ జయంతి సందర్భంగా ఆమె విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. వారితో గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, ఏఎంసీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ జకీ, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు నవాజ్‌మీరా, నాయకులు ఉన్నారు. చేర్యాలలో రజక సంఘం మండలాధ్యక్షుడు శివగారి అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహావరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కొమురవెల్లిలోనూ ఐలమ్మ జయంతిని నిర్వహించారు. హుస్నాబాద్‌లోని మున్సిపల్‌ కార్యాలయంలో ఐలమ్మ జయంతిని నిర్వహించారు. ఆమె చిత్రపటానికి చైర్‌పర్సన్‌ రజిత పూలమాలవేసి నివాళులర్పించారు. జగదేవ్‌పూర్‌ మండలంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతిని నిర్వహించారు. ఆమె విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఐలమ్మ జయంతి వేడుకల రాష్ట్ర కన్వీనర్‌గా నియామకమైన రజక సంఘం మండలాధ్యక్షుడు ఎల్లేశ్‌ను సభ్యులు సన్మానించారు. ములుగు మండలం మామిడాల గ్రామంలో ఐలమ్మ జయంతిని వంటిమామిడి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కోడూరు భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో, కొత్తూరులో నాగరాజు, రవి, అశోక్‌ ఆధ్వర్యంలో జయంతి నిర్వహించారు. రాయపోల్‌లో రజక రిజర్వేషన్‌ సమితి ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతిని నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కొండపాక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షురాలు సుగుణదుర్గయ్య ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి నిర్వహించారు. దూళిమిట్ట మండల కేంద్రంలో ఐలమ్మ జయంతిని సర్పంచ్‌ దుబ్బుడు దీపికావేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. వర్గల్‌ మండలంలో ఐలమ్మ జయంతిని రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ సతీ్‌షకుమార్‌ ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బెజ్జంకి మండలంలో ఎంపీపీ నిర్మల, సర్పంచ్‌ మంజుల, రజక సంఘం మండలాధ్యక్షుడు దిటి రాజు ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి నిర్వహించారు. ఆమె విగ్రహానికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. 

Read more