ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-09-11T04:38:49+05:30 IST

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు అన్నారు.

ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలి
దుబ్బాకలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు

పలు మండలాల్లో ఐలమ్మ వర్ధంతి

దుబ్బాక, సెప్టెంబరు 10: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. శనివారం దుబ్బాకలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు. నైజాం రజాకార్లకు, పటేల్‌ పట్వారీలకు వ్యతిరేకంగా భూమికోసం భుక్తికోసం తిరుగుబాటు చేసిన యోధురాలని కొనియాడారు. బానిసత్వానికి వ్యతిరేకంగా వేలాదిమంది సైనికులను తయారుచేసి, రజాకార్లను తెలంగాణ నుంచి తరిమికొట్టిందని గుర్తుచేశారు. అలాగే దుబ్బాక సీఐటీయూ కార్యాలయంలో ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్‌ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు శివ, మల్లయ్య, రాజయ్య, స్వామి, వేణు, సురేష్‌, రవీందర్‌, బీజేపీ, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. 

చేర్యాల: చాకలి ఐలమ్మ వర్ధంతిని శనివారం చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అంకుగారి స్వరూపారాణి, కౌన్సిలర్‌ ఆడెపు నరేందర్‌, తుమ్మలపల్లి లీల ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అలాగే సీపీఎం కార్యాలయంలో మాజీ జడ్పీటీసీ దాసరి కళావతి, సీపీఐ కార్యాలయంలో జిల్లా కార్యవర్గసభ్యుడు అందె అశోక్‌, అంగడి బజారులో తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ నివాళులర్పించారు. అలాగే కొమురవెల్లి మండల కేంద్రంలో సీపీఎం కార్యాలయంలో పార్టీ మండల కార్యదర్శి సత్తిరెడ్డి, సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. 

గజ్వేల్‌: ధీర వనిత చాకలి ఐలమ్మ అని గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి అన్నారు. గజ్వేల్‌ పట్టణంలోని చాకలి ఐలమ్మ భవన్‌ వద్ద గల ఆమె విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు. అంతకుముందు మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ గాడిపల్లి భాస్కర్‌, రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాంగారి శ్రీధర్‌, మాల మహానాడు యూత్‌ కార్యదర్శి నిరుడి స్వామి, ప్రజ్ఞాపూర్‌లో రజక సంఘం నాయకులు, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ వేములఘాట్‌లో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు కౌన్సిలర్‌ బొగ్గుల చందు, కే.శ్రీనివాస్‌, బాకి స్వామి, పొన్నాల కుమార్‌, రాజయ్య, ఇస్తారి, రామచంద్రాచారీ, శ్యామ్‌, నర్సింహులు, కనకయ్య, దుర్గయ్య, కర్ణాకర్‌, తిరుపతి పాల్గొన్నారు. 

గజ్వేల్‌ రూరల్‌: ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని గజ్వేల్‌ మండలంలోని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామరాజు సబ్బు బిళ్లపై ఐలమ్మ చిత్రం ఆవిష్కరించారు. 

మిరుదొడ్డి: ఐలమ్మ వర్ధంతి సందర్భంగా శనివారం మిరుదొడ్డిలో ఎంపీపీ సాయిలు, ఏఎంసీ చైర్మన్‌ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అలాగే మండలంలోని రుద్రారంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి సీపీఎం నాయకులు వెంకట్‌, మల్లేశం, బాబు పూలమాలవేసి నివాళులర్పించారు. 

చిన్నకోడూరు: చిన్నకోడూరు మండలంలోని మాచాపూర్‌లో సర్పంచ్‌ బాబు ఆధ్వర్యంలో శనివారం ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 

రాయపోల్‌: రాయపోల్‌లో తెలంగాణ రజక రిజర్వేషన్‌ సమితి ఆధ్వర్యంలో శనివారం చాకలి ఐలమ్మ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 

కోహెడ: కోహెడ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని రజక సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ పేర్యాల దేవేందర్‌రావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పిడిశెట్టి రాజు, టీఆర్‌ఎస్‌ యువజన సంఘం అధ్యక్షుడు శంకర్‌, రజక సంఘం మండలాధ్యక్షుడు చంద్రయ్య పాల్గొన్నారు. 

ములుగు: ములుగు మండలం సింగన్నగూడ, ములుగులో ఐలమ్మ వర్ధంతిని సర్పంచ్‌ గొల్లపల్లి బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. 

జగదేవ్‌పూర్‌: రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలంతా ఉద్యమించాలని రజక సంఘం మండలాధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్‌, ఎంపీపీ బాలేశంగౌడ్‌ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా శనివారం జగదేవ్‌పూర్‌లో ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు అక్కారం నరసింహులు, రాచకొండ బాల్‌ నర్సయ్య, రాచకొండ యాదగిరి, తదితరులు పాల్గొన్నారు. 

కొండపాక: కొండపాక మండలం దుద్దెడలో చాకలి ఐలమ్మ వర్ధంతిని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్‌ ఆరేపల్లి మహదేవ్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నూనె కుమార్‌ పాల్గొన్నారు. 

వర్గల్‌: మండల కేంద్రమైన వర్గల్‌తో పాటు ఆయా గ్రామాల్లో ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. వర్గల్‌ కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు గోపాల్‌, వెంకటేశ్‌, స్వామి, రాజు, పరుశరాం, శంభవ్య పాల్గొన్నారు. 

బెజ్జంకి: బెజ్జంకి మండలంలో ఐలమ్మ వర్ధంతిని రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండలాధ్యక్షుడు దిటి రాజు ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 

Updated Date - 2022-09-11T04:38:49+05:30 IST