పోడు భూములను పరిశీలించిన అదనపు కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-10-05T04:50:45+05:30 IST

మండలంలోని మంచిర్యాల గిరిజన తండాలో మంగళవారం సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ రాజర్షిషా పోడుభూముల సర్వే నిర్వహించారు.

పోడు భూములను పరిశీలించిన అదనపు కలెక్టర్‌
మంచిర్యాల గిరిజన తండాలో అధికారుల నుంచి పోడు భూముల వివరాలను అడిగి తెలుసుకుంటున్న అదనపు కలెక్టర్‌ రాజర్షిషా

వట్‌పల్లి, అక్టోబరు 4: మండలంలోని మంచిర్యాల గిరిజన తండాలో మంగళవారం సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ రాజర్షిషా పోడుభూముల సర్వే నిర్వహించారు. తండా పరిధిలోని పోడు భూములకు సంబంధించిన వివరాలను వట్‌పల్లి తహసీల్దార్‌ ప్రభుల నుంచి వివరాలను సేకరించి సర్వేను నిర్వహించారు. ఆయన వెంట ఎంపీడీవో జగదీశ్వర్‌, ఫారెస్టు అధికారి వేణుగోపాల్‌, సర్పంచ్‌ దీప్లానాయక్‌ ఎస్‌ఐ ఆంబ్ర్యానాయక్‌ తదితరులు ఉన్నారు. 

Read more