ఇష్టానుసారంగా గైర్హాజరవుతున్న ఉపాధ్యాయుడు

ABN , First Publish Date - 2022-09-10T05:53:50+05:30 IST

తమ తండాకు ఉపాధ్యాయులు సరిగా రావడం లేదని అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకునే వారే కరువయ్యారని కొండానాయక్‌ తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇష్టానుసారంగా గైర్హాజరవుతున్న ఉపాధ్యాయుడు
కొండానాయక్‌ తండాలో ఉపాధ్యాయుడి కోసం వేచి చూస్తున్న విద్యార్థులు

కొండానాయక్‌ తండా వాసుల ఆగ్రహం

నాగల్‌గిద్ద, సెప్టెంబరు 9: తమ తండాకు ఉపాధ్యాయులు సరిగా రావడం లేదని అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకునే వారే కరువయ్యారని కొండానాయక్‌ తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇష్టానుసారంగా సెలవులు మంజూరు చేస్తుండడంతో, ఉపాధ్యాయుడు తరచూ పాఠశాలకు  గైర్హాజరవుతున్నారని తెలిపారు. కాగా సదరు ఉపాధ్యాయుడు అధికారుల అండాతో తండాకు చెందిన యువకుడిని విద్య వలంటీర్‌గా నియమించుకొని, విద్యార్థులపై నిర్లక్ష్యం చూపుతున్నారన్నారు.


Read more