పిడిచేడ్‌ పాఠశాల భవనంపై ఎర్రకోట

ABN , First Publish Date - 2022-09-20T04:29:39+05:30 IST

గజ్వేల్‌ మండలం పిడిచేడ్‌ గ్రామానికి చెందిన జడ్పీటీసీ పంగ మల్లేశం తాను చదువుకున్న బడికి చేయూతనందిస్తున్నారు.

పిడిచేడ్‌ పాఠశాల భవనంపై ఎర్రకోట

చదువుకున్న బడికి జడ్పీటీసీ పంగ మల్లేశం చేయూత

గజ్వేల్‌ రూరల్‌, సెప్టెంబరు 19: గజ్వేల్‌ మండలం పిడిచేడ్‌ గ్రామానికి చెందిన జడ్పీటీసీ పంగ మల్లేశం తాను చదువుకున్న బడికి చేయూతనందిస్తున్నారు. ఈ క్రమంలో పాఠశాల భవనం పై భాగాన్ని ఢిల్లీ తరహాలో ఎర్రకోట రూపం వచ్చేలా తీర్చిదిద్దించారు. రూ.6 లక్షలకు పైగా తన సొంత డబ్బును ఖర్చుచేసి రాజస్థాన్‌, కేరళ కళాకారులతో పాఠశాలలోని డిజిటల్‌ తరగతి గది ముందు భాగంగా ఎర్రకోట రూపం వచ్చేలా ప్రత్యేక శ్రద్ధతో నిర్మాణం చేయించారు. అలాగే పాఠశాల ఆవరణలో సరస్వతీమాత విగ్రహం, తరగతి గదుల గోడలపై పలు రకాల నాట్యాలతో కూడిన పెయింటింగ్స్‌ వేయించారు. ఇటీవల జరిగన స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో జాతీయ జెండాను పాఠశాలలోని ఎర్రకోట ఆకృతి నిర్మాణంపై ఎగురవేయడంతో గ్రామస్థులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-09-20T04:29:39+05:30 IST