అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-09-25T05:00:07+05:30 IST

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని యూసు్‌ఫపేటలో శనివారం జరిగింది.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

పాపన్నపేట, సెప్టెంబరు 24: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని యూసు్‌ఫపేటలో శనివారం జరిగింది. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యూసు్‌ఫపేటకు చెందిన బైండ్ల యాదయ్య(49) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అప్పుడప్పుడు  చేపల చెరువు వద్దకు రాత్రి వేళ కాపలాకు వెళ్లేవాడు.  శుక్రవారం రాత్రి బయటకు వెళ్లి తిరిగి రాక పోయేసరికి చెరువు వద్దకు వెళ్లాడేమోనని కుటుంబీకులు భావించారు.  శనివారం ఉదయం కుటుంబీకులు కాల్‌ చేయగా గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతూ.. గ్రామ చెరువు కట్ట వద్ద దుస్తులు, ఫోన్‌ ఉన్నప్పటికీ, మనుషులు ఎవరూ లేరని చెప్పాడు. వెంటనే కుటుంబీకులు, స్థానికులు చెరువులో గాలించగా యాదయ్య మృతదేహం లభ్యమైంది. ఈ సమాచారమందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మెదక్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Read more