ఉరేసుకున్న ప్రేమజంట

ABN , First Publish Date - 2022-09-10T05:30:00+05:30 IST

ప్రేమజంట ఒకే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని అడవిమస్జిద్‌ గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది.

ఉరేసుకున్న ప్రేమజంట
ఉరేసుకున్న మహేష్‌, స్వప్న

ములుగు, సెప్టెంబరు 10: ప్రేమజంట ఒకే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని అడవిమస్జిద్‌ గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ములుగు మండలం మామిడ్యాల్‌కు చెందిన గొట్టి మహేష్‌(29) వ్యవసాయం చేస్తుంటాడు. మహే్‌షకు భవనందపూర్‌కు చెందిన అమ్మాయితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. మహేష్‌ భార్య ప్రస్తుతం గర్భిణి. కాగా మర్కుక్‌ మండల కేంద్రానికి చెందిన స్వప్న(19) కూలీ పని చేస్తుంటుంది. వ్యవసాయ పనులకు కూలీకి వచ్చిన స్వప్నతో మహేష్‌కు పరిచయం ఏర్పడింది. దీంతో మహేష్‌, స్వప్న కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. గతంలో ఇద్దరిపై మర్కుక్‌, ములుగు పోలీ్‌సస్టేషన్‌లో మిస్సింగ్‌ కేసులు సైతం నమోదయ్యాయి. ఇద్దరికీ పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి నచ్చజెప్పిన వీరి వైఖరి మారలేదు. కాగా శనివారం ఉదయం అడవిమస్జిద్‌ గ్రామ శివారు, కొండపోచమ్మ జలాశయం సమీపంలో మహేష్‌కు చెందిన వ్యవసాయ పొలం వద్ద ఇద్దరు ఒకే చెట్టుకు ఉరేసుకున్నారు. తాము ఎక్కడ ఉన్నది తెలిసేలా మహేష్‌ మేనమామకు ఫోన్‌లో లొకేషన్‌ పంపాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  మహేష్‌ తండ్రి యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ములుగు ఎస్‌ఐ రంగ కృష్ణ తెలిపారు.


Read more