జోరుగా మట్టి దందా

ABN , First Publish Date - 2022-11-27T23:47:34+05:30 IST

మండలకేంద్రంలో జోరుగా పట్టపగలే మట్టి రవాణా జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు.

జోరుగా మట్టి దందా
మట్టిని తరలిస్తున్న దృశ్యం

మనోహరాబాద్‌, నవంబరు 27: మండలకేంద్రంలో జోరుగా పట్టపగలే మట్టి రవాణా జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. 44వ జాతీయ రహదారి, పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లే దారి పక్కనే గల వెంచర్‌లో పట్టపగలే ఇష్టానుసారంగా మట్టి రవాణా చేస్తున్నారు. ప్రజలు సమాచారం అందించినా... అక్రమార్కులపై రెవెన్యూ అధికారులు కఠినంగా వ్యవహరించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. గతంలో కొండాపూర్‌, కూచారం గ్రామాల్లో మట్టి రవాణా చేస్తున్న వాహనాలను అధికారులు పట్టుకుని వారికి నచ్చినట్లు తూతూమంత్రంగా జరిమానా వేస్తూ వాహనాలను వదిలివేసున్నారు. మట్టి అక్రమ రవాణా విషయమై తహసీల్దార్‌ భిక్షపతిని వివరణ కోరగా.. మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. అలాగే పోలీస్‌ అధికారులను అడగ్గా తమకు ఎలాంటి సమాచారం లేదని తేల్చి చెప్పారు. ప్రతిసారి అధికారులను వివరణ కోరగా తగిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. కానీ చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు.

Updated Date - 2022-11-27T23:47:35+05:30 IST