ఆడబిడ్డలను గౌరవిస్తున్న ప్రభుత్వమిది: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-09-28T05:01:15+05:30 IST

ఆడబిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవిస్తున్నదని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు.

ఆడబిడ్డలను గౌరవిస్తున్న ప్రభుత్వమిది: ఎమ్మెల్యే
బెజ్జంకిలో బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌

 బెజ్జంకి, సెప్టెంబరు 27: ఆడబిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవిస్తున్నదని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో మంగళవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి బతుకమ్మ చీరలను పంపిణీ చేసి మాట్లాడారు.  అనంతరం ఐకేపీ కార్యాలయంలో రైతులకు అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్న వ్యవసాయ మిషనరీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, జడ్పీటీసీ కవిత, సర్పంచ్‌ మంజుల, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

హుస్నాబాద్‌రూరల్‌: హుస్నాబాద్‌ మండలంలోని పందిల్ల, మాలపల్లి, కూచనపల్లి, పొట్లపల్లిలో ఎంపీపీ లకావత్‌ మానస బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. హుస్నాబాద్‌లోని 17 గ్రామాలకు 8,010 బతుకమ్మ చీరలకుగాను, 6,330 వచ్చాయని, ఆయా గ్రామపంచాయతీల్లో షెడ్యూల్‌ ప్రకారం పంపిణీ చేస్తామని ఎంపీడీవో కుమారస్వామి తెలిపారు. 

సిద్దిపేట రూరల్‌: స్వరాష్ట్రంలోనే మహిళల ఆత్మగౌరవం పెరిగిందని సిద్దిపేట రూరల్‌ ఎంపీపీ శ్రీదేవి చందర్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని రాఘవాపూర్‌ పెద్ద చెరువులో బతుకమ్మల నిమజ్జనం కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీ భవనంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సమ్మిరెడ్డి, సర్పంచ్‌ రమేష్‌ పాల్గొన్నారు. 

చేర్యాల: చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి, ఎంపీటీసీ కౌసర్‌ సుల్తానా, పోతిరెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్‌ కత్తుల కృష్ణవేణి, వీరన్నపేటలో సర్పంచ్‌ భిక్షపతి, చిట్యాలలో సర్పంచ్‌ ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.

తొగుట: తొగుట మండలంలోని కానుగల్‌, బండారుపల్లి, చందాపూర్‌, గుడికందుల, లింగంపేట గ్రామాల్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు కంకణాల నర్సింహులు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు. 

మద్దూరు: నేడు మద్దూరు మండల కేంద్రంలోని తాజ్‌ ఫంక్షన్‌హాల్‌లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేతులమీదుగా ఉదయం 10 గంటలకు బతుకమ్మ చీరలు, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ ఉన్నదని ఎంపీడీవో శ్రీనివా్‌సగౌడ్‌ తెలిపారు. 

కోహెడ: కోహెడ మండల కేంద్రంలో సర్పంచ్‌ పేర్యాల నవ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ దేవేందర్‌రావు మంగళవారం మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. 

మిరుదొడ్డి: మిరుదొడ్డిలో ఎంపీపీ సాయిలు జడ్పీటీసీ లక్ష్మీలింగం, ఆత్మ కమిటీ చైర్మన్‌ భాస్కరాచారితో కలిసి చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు రాజు, సర్పంచులు బాల్‌రాజు, కిష్టయ్య పాల్గొన్నారు. 

Read more