హైటెన్షన్‌ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు

ABN , First Publish Date - 2022-10-01T04:40:34+05:30 IST

అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొట్టడంతో కారు బోల్తాపడింది. ఈ సంఘటన మండలంలోని గడిపెద్దాపూర్‌ శివారు 161వ జాతీయ రహదారి వద్ద శుక్రవారం జరిగింది.

హైటెన్షన్‌ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు

 అల్లాదుర్గం, సెప్టెంబరు 30: అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొట్టడంతో కారు బోల్తాపడింది. ఈ సంఘటన మండలంలోని గడిపెద్దాపూర్‌ శివారు 161వ జాతీయ రహదారి వద్ద శుక్రవారం జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణఖేడ్‌కు చెందిన ఓ వ్యక్తి కారులో హైదరాబాద్‌కు బయలుదేరాడు. గడిపెద్దాపూర్‌ సమీపంలోని 161వ జాతీయరహదారిపై కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు సుమారు వంద మీటర్ల వరకు దూసుకెళ్లి హైటెన్షన్‌ విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తా పడింది. విద్యుత్‌స్తంభం పక్కకు ఒరగడంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో మరో కారులో నారాయణఖేడ్‌కు తరలించినట్లు వివరించారు. 


 

Read more