సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో 21 కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-07-05T05:30:00+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో మంగళవారం ఆరుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది.

సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో   21 కరోనా కేసులు

సంగారెడ్డిఅర్బన్‌/నర్సాపూర్‌జూలై5: సంగారెడ్డి జిల్లాలో మంగళవారం ఆరుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది. జిల్లా వ్యాప్తం గా 208 మందికి టెస్టులు చేయగా, పటాన్‌చెరులో 10 మం దికి, సంగారెడ్డిలో ఆరుగురికి, నారాయణఖేడ్‌, గుమ్మడిదలలో ఒక్కొక్కరికీ కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరంతా హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఇక మెదక్‌ జిల్లాలో మంగళవారం 132 మందికి టెస్టు లు చేయగా మెదక్‌లో ఒకరికి, నర్సాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నర్సాపూర్‌ ప్రభుత్వాసుపత్రిలో నలుగురు పరీక్షలు చేయించుకోగా అందులో మండలంలోని పెద్దమ్మతండాకు చెందిన ఇద్దరికి పాజిటివ్‌గా వచ్చినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 

Read more