డ్రంకెన్‌ డ్రైవ్‌లో 14 మందికి జరిమానా

ABN , First Publish Date - 2022-07-19T05:19:53+05:30 IST

సిద్దిపేట ట్రాఫిక్‌ సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ షకీల్‌ హైమద్‌ తమ సిబ్బందితో కలిసి నాలుగురోజుల నుంచి సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్‌, ఎంపీడీవో చౌరస్తాల్లో, రాజీవ్‌ రహదారిపై వాహనాలు తనిఖీ నిర్వహించారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌లో 14 మందికి జరిమానా

సిద్దిపేట క్రైం, జూలై 18: సిద్దిపేట ట్రాఫిక్‌ సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ షకీల్‌ హైమద్‌ తమ సిబ్బందితో కలిసి నాలుగురోజుల నుంచి సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్‌, ఎంపీడీవో చౌరస్తాల్లో, రాజీవ్‌ రహదారిపై వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో  14 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని సోమవారం ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి రమే్‌షబాబు ఎదుట హాజరుపర్చగా విచారణ చేసి 14 మందికి రూ.31,500 జరిమానా, వారిలో ఒకరికి 3 రోజులు, మరొకరికి ఒకరోజు జైలు శిక్ష విధించారు. 

Read more