అన్నదమ్ముల మధ్య ఘర్షణ

ABN , First Publish Date - 2022-07-19T05:25:27+05:30 IST

అన్నదమ్ముల మధ్య ఘర్షణ

అన్నదమ్ముల మధ్య ఘర్షణ
భూక్య వెంకన్న మృతదేహం

 మనస్తాపంతో తమ్ముడి ఆత్మహత్య

కురవి, జూలై 18 : అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో మనస్తాపానికి గురైన తమ్ముడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కురవి మండలం ఎలకచెట్టుతండాలో సోమవారం చోటు చేసుకుంది. కురవి ఎస్సై బి.రాము తెలిపిన వివరాల ప్రకారం... భూక్య వెంకన్న(50), భూక్య బాలు ఇద్దరు అన్నదమ్ములు. ఇరువురు రైతులు. కాగా, ఇంటి స్థలం విషయంలో ఇరువురి మధ్య శనివారం ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో అన్న భూక్య బాలు కుమారులు భూక్య ప్రవీణ్‌, సురే్‌ష.. తమ బాబాయ్‌ భూక్య వెంకన్నను చేతులతో కొట్టి.. కాళ్లతో తన్నారు. దీంతో మనస్తాపం చెందిన వెంకన్న శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన వెంకన్నను మహబూబాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయన్ను ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. భూక్య వెంకన్న కుమారుడు వీరన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూక్య బాలు, ప్రవీణ్‌, సురే్‌షలపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. 

Read more