ఐదు రోజుల్లో రూ. కోటి ఆదాయం

ABN , First Publish Date - 2022-08-16T06:05:12+05:30 IST

ఐదు రోజుల్లో రూ. కోటి ఆదాయం

ఐదు రోజుల్లో రూ. కోటి ఆదాయం

 వరంగల్‌ రీజియన్‌లోనే తొర్రూరు డిపో ప్రథమ స్థానం

 రాష్ట్ర స్థాయిలో మూడో స్థానం

 సిబ్బందిని అభినందించిన డీఎం రమేష్‌

తొర్రూరు, ఆగస్టు 15: రాఖీ పండుగ పురస్కరిం చుకుని ఐదు రోజులుగా తొర్రూరు ఆర్టీసీ డిపో అధికా రులు బస్సులను వివిధ రూట్‌లలో నడపగా సుమారు కోటి రూపాయల ఆదాయం సమకూరినట్లు డిపో మేనేజర్‌ కె. రమేష్‌ తెలిపారు. ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు డిపోకు సుమారు రూ. కోటి 4లక్షల ఆదా యం సమకూరిందని, 10వ తేదీ రూ.16లక్షలు, 11న రూ.20లక్షలు, 12న రూ.26లక్షలు, 13న రూ.23లక్షలు, 14న రూ.19లక్షలు ఆదాయం సమకూరినట్లు తెలిపా రు. ఐదు రోజులుగా రాఖీ పండుగను పురస్కరించు కుని సిబ్బంది వివిధ రూట్‌లలో బస్సులను నడపగా ఆదాయం ఘనంగా సమకూరిందన్నారు. అత్యధికంగా ఓఆర్‌ శాతం 107 నమోదు కాగా, సర్వీసులు 97శాతం ప్రయాణికులను ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా, ప్రమాదాలు జరగకుండా వారి గమ్య స్థానాలకు చేర్చడం జరిగిందన్నారు. వరంగల్‌ రీజియన్‌ పరిధిలో ఉన్న తొమ్మిది డిపోల్లో తొర్రూరు డిపోకు అత్యధిక ఆదాయం సమకూరిందని, రాష్ట్రంలోని అన్ని డిపోల్లో రాఖీ పండుగ సందర్భంగా నడిపిన సర్వీసుల్లో 3వ స్థానంలో ఉందన్నారు. సోమవారం స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఉత్తమ డిపో మేనేజర్‌గా మంత్రి సత్యవతి రాథోడ్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్నానని తెలిపారు. డిపోలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు, కండక్టర్‌ డ్రైవర్లకు, కార్మికులకు కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు. 

Read more